calender_icon.png 11 December, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనం.. ఐఎన్టీఎస్ఓ ఫలితాలు

10-12-2025 08:40:48 PM

ఒలంపియాడ్‌లో 389 మంది సెలెక్షన్..

వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ఐఎన్టీఎస్ఓ ఒలంపియాడ్ ఫలితాల్లో మరోసారి ప్రతిభ చాటారు. ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్‌లో మొత్తం 389 మంది విద్యార్థులు ఎంపికై, సెకండ్ లెవెల్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సుదేష్ కుమారి మాట్లాడుతూ, ఒలంపియాడ్ పరీక్షలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ముద్రకోల రాజు, అకాడమీ కో- ఆర్డినేటర్ ప్రవీణ్, ప్రిన్సిపాల్ సుదేష్ కుమారి, లీలావతి, డి.అంజయ్య, సి–బ్యాచ్ ఇంచార్జి అరుణ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆకునూరి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.