22-07-2025 12:00:00 AM
చారకొండ జూలై 21: నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని (సెలూన్) ఎవరైనా చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా బాధాకరమని నాయి బ్రాహ్మణుల కులవృత్తిని కాపాడుకుందామని అందరూ కలిసికట్టుగా రావాలని నాయి బ్రాహ్మణుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం పల్లి రవి నాయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దుర్గామాత దేవాళయావరణంలో సమావేశమాయ్యారు.
రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి నేటి వరకు నాయి బ్రాహ్మణులు తమ కులవృత్తిని నమ్ముకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణుల వృత్తిని ఎవరైనా చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు వారి అవసరాలకు నాయి బ్రాహ్మణులు అవసరం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శంకరయ్య, తిరుపతయ్య, వెంకటయ్య, సత్యనారాయణ, రాము, పెద్ద వెంకటేష్ ఆంజనేయులు, తిరుమలేష్, కృష్ణయ్య, చిన్న వెంకటేష్, రామకృష్ణ, రమేష్, అనిల్, నిరంజన్, కృష్ణ తదితరులుపాల్గొన్నారు.