calender_icon.png 27 November, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

27-11-2025 12:28:45 AM

  1. మతవాదులు, రాజ్యాంగ వ్యతిరేకులపై అప్రమత్తంగా ఉండాలి

ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి* ప్రొఫెసర్ వాగీషన్

హుస్నాబాద్, నవంబర్ 26 :ప్రపంచంలోనే ఉత్తమమైన భారత రాజ్యాంగాన్ని కొంత మంది మతవాదులు నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల జాగ్రత్త వహించాలని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ వాగీషన్ హెచ్చరించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జేఏసీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, ఆచరణలో ఉంచాలన్నారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజయం సాధించిన పలువురు విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.