calender_icon.png 27 November, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగంపై గౌరవం ఉండాలి

27-11-2025 12:29:11 AM

జిల్లా జడ్జి జి రాధిక 

నిర్మల్, నవంబర్ 26 (విజయక్రాంతి): భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని ప్రతి భారతీ యుడు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవ జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి జీ రాధిక అన్నారు. అఖిలభారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరియైన పరిపాలన కోసం రాజ్యాంగ ఆవశ్యకతను గుర్తించి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాం గాన్ని బిఆర్ అంబేద్కర్ రచించడం జరిగిందని అన్నారు. సమర్థవంతమైన మన రాజ్యాంగం ద్వారానే మన దేశం ఈనాడు సుస్థిరంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. రాజ్యాంగంలోని సెక్షన్లను తెలుసుకున్నట్లయితే మనకు జరిగిన టువంటి అన్యాయాలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని, సరియైన న్యాయ సేవలను పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వైజర్స్ రాజలింగం లింగాగౌడ్, జిల్లా ఆస్పత్రిలో పర్యవేక్షణ అధికారి డాక్టర్ సురేష్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రై ట్స్ ప్రొటెక్షన్ జిల్లా అధ్యక్షులు డి రాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు సామెర్ల రాజన్న, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వి ప్రభాకర్. సంఘ సభ్యులు డి రాజేశ్వర్ తాళ్ల చిన్నయ్య ఏ రాజేశ్వర్ వసంత్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.