calender_icon.png 17 January, 2026 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాధికారం సాధిద్దాం

17-01-2026 04:06:44 AM

  1. టీఆర్పీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

బీఆర్‌ఎస్‌కు చెందిన సూర్యాపేట నేతలు పలువురు టీఆర్పీలో చేరిక

హైదరాబాద్, జనవరి 16: సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న పార్టీలో చేరినవారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భం గా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడు తూ తెలంగాణలో మార్పు మొదలైందని, బీఆర్‌ఎస్ అంటే కేవలం వెలమల పార్టీ అని ఆ పార్టీలో బీసీలకు చోటులేదని గ్రహించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన పార్టీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారనీ తెలిపారు.

సూర్యాపేట గడ్డపై మల్ల న్న నాయకత్వాన్ని బలపరుస్తూ, రాబో యే రోజుల్లో పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు. పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో కు టుంబ పాలనను అంతం చేసి అగ్రవర్ణాల ఆధీనంలో ఉన్న తెలంగాణను విముక్తి చేసి బీసీల చేతిలో రాజ్యం పెట్టడమే ధ్యేయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయి లో పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా పార్టీని నడిపించాలని నూతనంగా పార్టీలో చేరిన వారిని కోరారు. కాగా పిడమర్తి ఉపేందర్, నేలచర్ల మధు, పిడమర్తి కోటేష్, పొట్టపెంజర రమేష్, పొట్టపెంజర వీరాంజనేయులు, పొట్టపెంజర ప్రేమ్ సుందర్, పిడమర్తి మధు, శ్రీపతి వెంకన్న సాయి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లoకొండ నీరజ గౌడ్, నాయకులు బొల్లె సైదులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై గళమెత్తండి

ఖమ్మం, జనవరి 16: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)ని క్షేత్రస్థాయిలో బలోపీతం చేసి, ప్రజా పక్షాన పోరాటాలు చేయడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో దిశా- నిర్దేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకొని, నాయకులు అడ్వాన్డ్స్‌గా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్  మాట్లాడుతూ ‘తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం సాధించేందుకు, ‘ఎవరికి అంతా వారికి అంత’ అనే బలమైన నినాదంతో మన పార్టీ పుట్టింది.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ పోటీలో ఉంటుందన్నారు.

రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజు మాట్లాడుతూ నేడు నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటమే మన ప్రథమ కర్తవ్యం అని అన్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, నాయకులు లింగం యాదవ్, డి సోమాచారి,పార్టీ కార్యకర్తలు నాగేశ్వరరావు,రవి తదితరులు పాల్గొన్నారు.