calender_icon.png 17 January, 2026 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి ఐద్వా జాతీయ మహాసభలు

17-01-2026 04:04:47 AM

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి 

ముషీరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 28 వరకు నగరంలో  నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షు లు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బాగ్ లిం గంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై జాతీయ మహాసభల ప్రచార బెలూన్ ను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు ఐద్వా జాతీయ నాయకులు బృందా కరత్, శ్రీమతి టీచర్, దావలె, పుణ్యవతి లు హాజరవుతారని తెలిపారు. మహిళా సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహాసభ సందర్భంగా నగరంలో తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. మహాసభకు మహిళలు, ప్రజలు సహకరించాలని కోరారు.

ఈనెల 25న బస్‌భవన్ గ్రౌండ్లో బహిరంగసభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రజాసంఘాలనాయకులు అబ్బాస్, టీసాగర్, భూపాల్, శ్రీరామ్ నాయక్, వెంకట్‌రాములు, శోభన్,  రవీందర్, రమేష్, ధర్మానాయక్ పాల్గొన్నారు.