calender_icon.png 17 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ రంగానికి సుస్థిర రవాణ

17-01-2026 04:08:25 AM

జేఎస్పీ హ్యుందాయ్ గ్రీన్ ఇనిషియేటివ్

హైదరాబాద్, జనవరి 16: పర్యావరణ హిత భవిత దిశగా జేఎస్పీ హ్యూండాయ్, నూరీ ట్రావెల్స్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది.  ఇందులో భాగంగా కార్పొరేట్, లాజిస్టిక్స్ రంగాల కోసం హ్యుందాయ్ ప్రై మ్ ఎస్‌డీ, ప్రైమ్ హెచ్‌బీ సీఎన్‌జీ వాహనా ల ఫ్లీట్‌ను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఎస్పీ హ్యూండాయ్‌లో శుక్రవారం హ్యుం దాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజనల్ సేల్స్ హెడ్ అమి త్ కుమార్ సింగ్, నూరీ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నబీల్, జేఎస్పీ హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరెడ్డి కలిసి సీఎన్‌జీ వాహనాల ఫ్లీట్‌ను ప్రారంభించారు.

అమిత్ కు మార్ మాట్లాడుతూ సీఎన్‌జీ వాహనాలు ఇంధన వ్యయం తగ్గించడమే కాకుండా, కా లుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పృథ్వీరెడ్డి మాట్లాడుతూ సస్టైన బుల్ ట్రాన్స్‌పోర్ట్ భవిష్యత్తుకు మార్గం.. కా ర్పొరేట్ లాజిస్టిక్స్ రంగాలకు సీఎన్జీ వాహనాలు అందించడం ద్వారా తక్కువ వ్య యంతో, పర్యావరణ హిత పరిష్కారానికి తమ వంతు కృషిగా పేర్కొన్నారు.  సూర్య ట్రావెల్స్ నుంచి నిహార్, డబ్ల్యూటీఐ ఎండీ మాలిక్, జేఎస్పీ హ్యుందాయ్ బిజినెస్ హెడ్ పూర్ణిమ, సీజీఎం సంతోష్, ఎస్‌ఎం శ్రీను నాయక్, టెక్ లీడ్ శివ శేఖర్ పటేల్ ఉన్నారు.