calender_icon.png 18 October, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్జేడీ-కాంగ్రెస్‌ను ఊడ్చేద్దాం

18-10-2025 01:46:02 AM

  1. బీహార్‌లో ఓటర్లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపు
  2. సరన్ జిల్లా నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
  3. మహాఘట్బంధన్‌పై విమర్శలు

పాట్నా, అక్టోబర్ 17: అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ- కాంగ్రెస్ (మహాఘట్బంధన్) కూటమిలను ఊడ్చేసి.. ఎన్డీ యే అత్యధిక సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగో దీపావళిని జరుపుకోవా లని కేంద్ర హోం మంత్రి  అమిత్ షా బీహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు.  బీహార్‌ని సరన్ జిల్లాలో శుక్రవారం ఆ యన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సంవత్సరం బీహార్ ప్రజలకు నాలుగు దీపావళులు జరుపుకునే అవ కాశం ఉందని అమిత్ షా చెప్పారు.

‘మొదటిది, అయోధ్యలో శ్రీరాముని రాక సంద ర్భంగా వచ్చే దీపావళి, రెండవది నితీష్ జీ, మోదీ జీ బీహార్‌లోని మహిళలకు రూ. 10,000 అందిస్తే ఇప్పటికే పూర్తయ్యిందని. మూడవ దీపావళి 395 ఉత్పత్తులపై జీఎస్టీని 5 శాతం, 0 శాతానికి తగ్గించడం. ఇక నాల్గవ దీపావళి.. ‘లాలూ, రాహుల్ వారి పార్టీలను ఓడించి, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు జరుపుకుందాం’ అని షా ప్రకటించారు. 

లాలూ, రబ్రీ దేవిది ఆటవిక పాలన

అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి హయాంలో ’జంగిల్ రాజ్’ (ఆటవిక పా లన) రోజులను యువతరం గుర్తుంచుకోవాలని కోరారు. ‘సరన్ నుంచే ప్రచారం ప్రా రంభిస్తే విజయం ఖాయమని.. లాలూ, రబ్రీల  అడవి పాలన గురించి బీహార్ యు వతకు గుర్తుచేయడం, దానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేయించడానికి ఛప్రా, సరన్ కంటే మంచి ప్రదేశం లేదు‘ అని ఆయన ఉద్ఘాటించారు.

అమిషా తన ప్రసంగంలో నితీష్‌కుమార్ కుమారుడు బీహార్‌ను అడవి పాలన నుంచి విముక్తి కల్పించారని కొనియాడారు. ఆర్జేడీ - రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థుల జాబితా షహబుద్దీన్ కుమారుడి పేరును చూసి ఆశ్చర్యపోయానని అమిషా తెలిపారు. షహబుద్దీన్ కుమారుడికి ఆర్జేడీ టికెట్ ఇస్తే బీహార్ సురక్షితంగా ఉం టుందా?‘ అని ప్రశ్నించారు.