సహజ ఎరువులు వాడదాం!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం ఊహించని స్థాయిలో గణనీయంగా పెరిగినట్టు స్పష్టమౌతోంది. అయితే, రైతులు ఎవరి సలహాలు పాటించకుండా పంట పొలాలకు మందులు కొడుతున్నారు. సహజ సిద్ధంగా లభించే ఎరు వులను వినియోగించకుండా రసాయనాలవైపే మొగ్గు చూపుతున్నట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా నేల సారం దెబ్బ తిని, ఉత్పత్తి తగ్గుతోంది. పంట నష్టమూ కొన్నిసార్లు వాటిల్లుతోం ది.
అయితే, పురుగు మందుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రత్యా మ్నాయ పోషకాల వినియోగాన్ని సాగులో ప్రోత్సహించే కార్యక్రమానికి కేంద్రం రూపకల్పన చేసినా అది కర్షకులకు చేరడం లేదు. దేశంలోనే అత్యధికంగా పెస్టిసైడ్స్‌ను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం ఆందోళనకరం. వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. కోడి ఎరువు, పశువుల పేడ, వర్మి కంపోస్టు వంటి ఎరువుల ద్వారా పంట దిగుబడి పెరిగే అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంది.
కె.బాపురావు






