calender_icon.png 11 May, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దాం

11-05-2025 01:36:53 AM

- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

- మీరే గ్రామాలకు ముఖ్యకార్యదర్శులు

- మంత్రి పొన్నం ప్రభాకర్

- ప్రభుత్వానికి అండగా ఉండాలి: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ 

- పెద్ద అంబర్‌పేట్‌లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం 

అబ్దుల్లాపూర్‌మెట్, మే 10: గ్రామాల అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నా రు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్‌లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గ్రామా ల అభివృద్ధికి అందరం కృషి చేద్దామని పం చాయతీ కార్యదర్శులతో అన్నారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల కు చేర్చే బాధ్యత పంచాయతీ కార్యదర్శుల దేనన్నారు.

ఈ నెల 25 లోగా పంచాయతీ కార్యదర్శుల సంఘ నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరి స్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మా ట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులే ముఖ్యకార్యదర్శులన్నారు. గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. 

కాంగ్రెస్‌పై విష ప్రచారం: మహేశ్‌గౌడ్ 

కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు బీజే పీ, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ప్రజాపాలన ప్రభుత్వానికి పంచాయతీ కార్యదర్శులు అండగా ఉండాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పారు.

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన సాగించి, మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తప్పులు చేయడం సహజం.. ఆ తప్పులను సరిదిద్దుకునే అలవాటు తమకు ఉన్నదన్నారు.

కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీపీఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్‌గౌడ్, నాగరాజు, గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్, ఉపాధ్యక్షుడు ఎం సందీప్, కోశాధికారి శశిధర్‌గౌడ్ పాల్గొన్నారు.