11-05-2025 01:42:21 AM
- పాకిస్థాన్‌ను అంతసులువుగా నమ్మొద్దు
- మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి
హైదరాబాద్, మే 10: భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వితే పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ కోల్పోవడం ఖాయమని ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ కావాలనే భారత్‌ను రెచ్చగొడుతుందని, యుద్ధానికి పురిగొ ల్పుతుందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూ ర్, తదనం తరం భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివా రం ఆయన స్పందించారు. ఒకవేళ ద్వైపాక్షిక చర్చలు జరిగి వెనక్కి తగ్గుతామని పాక్ ప్రకటించినా.. ఆ దేశాన్ని అంత సులభంగా నమ్మొద్దని హితువు పలికారు. గత ఉదంతాలను పాక్ గుర్తుచేసుకోవాలన్నారు.
కార్గిల్ యుద్ధ సమయంలో నార్తర్న్ కమాండ్‌కు చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించిన ఏఆర్కే రెడ్డి వివిధ అంశాలను వివరించారు. ‘కార్గిల్ యుద్ధాన్ని దగ్గరగా చూశా. అప్పట్లో ఎల్‌వోసీ దాటకూడదన్న లక్ష్మణ రేఖ ఉండేది. కార్గిల్ వార్‌లో పాక్ ఓటమితో నవాజ్ షరీఫ్ గవర్నమెంట్ కుప్పకూలింది. ముషారఫ్ అధ్యక్షుడుయ్యాడు.
కార్గిల్ యుద్ధం, ఆ దేశ అస్థిరతకు కారణమైంది. తర్వాత ముషారఫ్ కూడా అధికారాన్ని కోల్పోయాడు. కానీ, ఇన్నేళ్లుగా మన ప్రజాస్వామ్య ప్రభు త్వం సుస్థిరంగా ఉంది. పాక్ తన ధోరణిని మార్చుకోకపోతే పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు భారత్ వెనకాడదు’ అని పేర్కొ న్నారు.
‘ఉద్రిక్తతను తగ్గించుకోవాలని పాక్ భావిస్తే, ముం దుగా ఆ దేశమే తగ్గాలి. పహల్గాంలో భార్య ముందు భర్తను, కొడుకు ముందు తండ్రిని అతి దారుణంగా హతమార్చారు. కావాలనే మనల్ని రెచ్చగొట్టారు. 140 కోట్ల మంది పౌరులు మన సాయుధ బలగాల వెంట ఉన్నారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్‌పై ఉసిగొల్పుతున్న పాకిస్థానే ఈ విషయంలో వెనక్కి తగ్గాలి. ఉగ్రవాదులు చనిపోతే అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించే సంస్కృతి ఆ దేశానిదే’ అని వ్యాఖ్యానించారు.