11-05-2025 01:33:45 AM
- కవులు, కళాకారులు హాజరై జయప్రదం చేయాలి
- అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
ముషీరాబాద్, మే 10: అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తిసభ సుందర య్య విజ్ఞానకేంద్రంలో సోమవారం నిర్వహించనున్నట్టు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క శనివారం ప్రకటనలో తెలిపారు.
1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్, ప్రసాద్ చొరవతో అరుణోద య సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింద న్నా రు. 2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోనే 50 వసంతాల సభలను విజయవం తంగా పూర్తి చేసుకుందని తెలిపారు.
50 ఏళ్ల చరిత్రను, కృషిని, పరిస్థితిని సృజించుకునే పనితో పాటు ‘అరుణోదయం’ అనే సావనీర్ ఆవిష్కరించుకునే కార్యక్ర మం మిగిలే ఉందన్నారు. అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటూ జరిగే అరుణోదయ 50 ఏళ్ల పరిపూర్తి స్ఫూర్తి ముగింపు సభలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ సభలను జయప్రదం చేయాలని కవులు, కళాకారుల కు, ప్రజా కళాభిమానులందరికీ విజ్ఞప్తి చేశా రు. సభా కార్యక్రమాలలో భాగంగా ఉద యం 10 గంటలకు సుందరయ్య పార్కు చుట్టూ కళా ప్రదర్శన ఉంటుందన్నా రు. అరుణోదయ నాగన్నచే జెండా ఆవిష్కర ణ కార్యక్రమం ఉం టుందన్నారు.
విమలక్క సభాధ్యక్షతన నిర్వహించే కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ (సినీ దర్శక నిర్మాత), మీనా కందస్వామి(రచయిత్రి, చెన్నై), ప్రారంభకులు డాక్టర్ బుర్ర రమేష్ (ఖిలా వరంగల్), ప్రధానోపన్యాసం దివికు మార్ (అధ్యక్షుడు, జనసాహితి), అరుణోద యం సావనీర్ ఆవిష్కరణ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, పుస్తక సంపాదకుల మాటలు డాక్టర్ ఏకే ప్రభాకర్, కొల్లాపురం విమల, అరుణోదయ డాక్యుమెంటర్ ఆవిష్కరణ రాం సత్తాయ్య, మూడు విప్లవ సం స్థలకు 50 ఏళ్లు పాట ఆవిష్కరణ అంబిక, వేయిపడగల విషపు నీడలు’ పుస్తక ఆవిష్కరణ ఎనిశెట్టి శంకర్, భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజా సం స్కృతి-సాంస్కృతికోద్యమ నిర్మాణ ఆవశ్యకతపై పలువురు వక్తల ప్రసంగాలు, సాయం త్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అన్ని సంస్థల సౌహర్ధ సందేశాలు, సాయం త్రం 7 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కల్చరల్ నైట్ ఉంటాయన్నారు. అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనితచే ముగింపు పలుకులు ఉంటాయని విమలక్క పేర్కొన్నారు.