calender_icon.png 6 August, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడేపూడి ఆశయ సాధనకు కృషి చేద్దాం

06-08-2025 12:00:00 AM

సీపీఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి సభ

భద్రాచలం, ఆగస్టు 5, (విజయ క్రాంతి):మధిర మాజీ శాసనసభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్క్సిస్టు పార్టీ నేత అమరజీవి బోడిపూడి వెంకటేశ్వరరావు ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు పిలుపు నిచ్చారు. కామ్రేడ్ బోడేపూడి వెంకటేశ్వరరావు గారి 28వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది.

ముందుగా బోడెపూడి గారి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ బోడేపూడి సిపిఎం పార్టీ శాసనసభాపక్ష నేతగా అన్ని పక్షాల మన్ననలు పొందారని, నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సైతం తనవద్ద సూచనలు సలహాలు తీసుకునే వారిని అన్నారు. శాసనసభలో ప్రజల సమస్యలపై గలమెత్తారని అన్నారు.

మధిర నియోజకవర్గం అభివృద్ధి తోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక సమస్యలపై ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతాంగం సమస్యలపై ఆయనఎనలేని కృషి చేశారని అన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు.

అదే కామ్రేడ్ బోడిపూడి వెంకటేశ్వరరావు గారికి మనం ఇచ్చే ఘణ నివాళులు అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నకిరికంటి నాగరాజు, కుంజా శ్రీనివాస్, ఎస్ భూపేంద్ర భ నాయకులు ఎం వి ఎస్ నారాయణ, ముత్తయ్య, మురళి తదితరులుపాల్గొన్నారు.