06-08-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 5: హఫీజ్పెట్ డివిజన్ కి చెందిన లో కం గోపీనాథ్ వైద్య చికిత్స నిమిత్తం ము ఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60,000/- అరవై వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి ఎ మ్మెల్యే గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జిల్లా గణేష్, ఇబ్రహీం, మల్లేష్ యాదవ్ తదితరులుపాల్గొన్నారు.