calender_icon.png 10 October, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్ కలిగిన తుపాకులు అప్పగించాలి

10-10-2025 12:59:06 AM

సీపీ విజయ్ కుమార్

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 9 : స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు కలిగి ఉన్న వ్యక్తులు వాటిని ఈ నెల 11 లోగా పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తిరిగి నిబంధనల ప్రకారం తీసుకొని వెళ్లవచ్చని తెలిపారు.

గడువులోగా తుపాకులు డిపాజిట్ చేయని వారిపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో అయిదు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, ఇరవై నాలుగు గంటలు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు.