calender_icon.png 10 October, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి

10-10-2025 01:00:21 AM

రాష్ట్ర మాల మహానాడు సభ్యులు కొండి స్వామి

చేగుంట, అక్టోబర్ 9 :పంచాయతీ సెక్రెటరీ వల్ల ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర మాల మహానాడు సభ్యుడు కొండి స్వామి డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ లక్ష్మి భర్త అంజయ్య చేగుంట తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 97లో సర్వే చేసి ఎకరం భూమి పట్టా పాస్ బుక్ త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తహసీల్దార్ స్పందిస్తూ ఈ విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.