calender_icon.png 11 October, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణలో మేము సైతం

10-10-2025 12:57:58 AM

* మొక్కలు నాటిన గీతం అధ్యాపకులు, విద్యార్థులు

పటాన్ చెరు, అక్టోబర్ 9 :పర్యావరణ స్థిరత్వం, దానిపై అవగాహన, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో సంఘటిత భావాన్ని ప్రోత్సహించడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మహిళా సాధికారత విభాగం (డబ్ల్యూఈసీ) గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. పచ్చదనం, పరిశుభ్రత, మరింత స్థిరమైన ప్రాంగణ వాతావరణాన్ని పెంపొందించడంలో గీతం కుటుంబ సభ్యులంతా సమిష్టి బాధ్యత తీసుకునేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

గీతం ప్రాంగణంలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో మొక్కలు నాటడంలో అంతా ఉత్సాహంగా పాల్గొని, పర్యావరణ పరిరక్షణలో గీతం నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత విభాగం చైర్ పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ స్పృహను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఇటువంటి కార్యక్రమాలు పర్యావరణ సమతుల్యతకు దోహదపడటమే కాకుండా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వారందరిలో సోదర భావం, సమిష్టి కృషి, తమదనే భావనను పెంపొందిస్తాయన్నారు. రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ఎం.అక్కలక్ష్మి, క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ఎస్టేట్ అధికారి ఎం.సతీష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అందరినీ ఉత్సాహపరిచారు.