calender_icon.png 28 November, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగం కన్నా ప్రాణం మిన్న

27-11-2025 12:00:00 AM

భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఉప్పల్, నవంబర్ 26 (విజయక్రాంతి) : వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ వాహనదారులకు భద్రత అవగాహన సదస్సును కుషాయిగూడ పోలీసులు నిర్వహించారు బుధవారం రోజున  రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాల మేరకు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు కుషాయిగూడ ల్యాండ్ ఆర్డర్ ఏసిపి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో వాహనదారుల ట్రాఫిక్ నిబంధనలు పాటించిన యెడల జరిగే పరిణామాల గురించి వాహనదారులకు తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది  సత్ ప్రవర్తన కలిగిన హిస్టరీ రౌడీషీటర్లు పాల్గొని ట్రాఫిక్ నియంతరకు పోలీసు లకు సహాయంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ ఏసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో నిబంధనలు పాటించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరిగా అవకాశం ఉండదన్నారు.

వాహనదారులు విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని వాహనం నడిపేటప్పుడు చరవాణి ఉపయోగించవద్దని వాహ నదారులకు సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన సహించేది లేదన్నారు. వాహనదారులు నిబంధన లు పాటించాలని దీనికను ల్యాండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులతో సత్ప్రవర్త కలిగిన పలు రౌడీ షీటర్లతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులు పాటించే విధంగా చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రుద్వీర్ కుమార్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్ మధు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.