calender_icon.png 28 November, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో46కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు!

27-11-2025 12:00:00 AM

  1. పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు
  2. బీసీ జనాభా ఆధారంగా కేటాయించలేదని పలు పిటిషన్ల దాఖలు
  3. రాష్ట్రవ్యాప్తంగా జీపీ ఎన్నికల్లో 17 శాతమేనని ఆవేదన
  4. సంగారెడ్డి కలెక్టర్ గెజిట్‌ను రద్దు చేయాలని డిమాండ్
  5. విచారణ గురువారానికి వాయిదా

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వం ఇచ్చిన జీవో 46కు విరుద్ధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించారని రాష్ట్రంలోని అనేక గ్రామాల నుంచి బీసీ నాయ కులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 19శాతమే బీసీ రిజర్వేషన్లు వచ్చాయని, జిల్లా కలెక్టర్ ఇచ్చిన గెజిట్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే జీపీ ఎన్నికల్లో బీసీలకు 17 శాతమే దక్కిందని, మరి 42 శాతం ఎట్లా ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. అయితే హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన తొమ్మిది పిటిషన్లపై జస్టిస్ మాధవి దేవి విచారణ జరిపి..గురువారానికి వాయిదా వేశారు.  తెలంగాణలో పంచాయతీ ఎన్నికల శంఖారావం మోగింది. ఈ నేపథ్యంలో పంచా యతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ ఒకరు పిటిషన్ వేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. వార్డులన్నింటినీ ఎస్సీ, ఎస్టీలకే కేటాయించారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల జనాభా అధికంగా ఉందంటూ ఇం కో పిటిషనర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో సరైన రిజర్వేషన్ల పాటించడం లేదంటూ ఆంధోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీఓ 46 తీసుకొచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.

జిల్లాలో మొత్తం 613 పంచాయతీలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీలకు 117 సర్పంచ్ స్థానాలనే రిజర్వుచేశారని చెప్పా రు. సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 19 శాతమే ఉందని పిటిషనర్ న్యా యవాది వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేసి మళ్లీ రిజ ర్వు చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం రిజర్వేషన్లు వస్తు న్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభు త్వం తీసుకొచ్చిన జీఓ 46కు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకంగా ఉన్నాయని మరో పిటి షనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి బుధవారం విచారణ చేపట్టారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని పిటినర్ తరఫు న్యాయవాది వాదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు సర్పంచుల రిజర్వేషన్లు కేటాయించి నట్లు స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి కోర్టుకు తెలిపారు. రోస్టర్ ప్రకారం.. రిజర్వేషన్లు మారుతాయని ధర్మాసనానికి వివరించా రు. 2011 జనాభా గణనలో తప్పులున్న ట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారని..దీనికి కేంద్రమే సమాధానం చె ప్పాల్సి ఉందని ఆయన వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు విచా రణను గురువారానికి వాయిదా వేసింది. 

ఒక్క వార్డు కూడా బీసీలకు దక్కలే..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మం డలం తిమ్మినోనీపల్లిలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. గ్రా మంలో మొత్తం 983 మంది ఓట ర్లు ఉండగా, అధికారులు ఎనిమిది వార్డులుగా విభజించినట్లు సమాచా రం. వీరిలో మహిళలు 501 మంది, పురుషులు 482 మంది ఉన్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా రెండు ఎస్సీ, రెండు ఎస్టీ, రెండు జనరల్ ఉమెన్, మిగిలిన రెండు రిజర్వ్డ్‌గా గుర్తించారు.

గ్రామంలో మొత్తం 346 మంది బీసీ జనాభా ఉన్నప్పటికీ ఒక్క వార్డు కూడా బీసీలకు కేటాయించకపోవడంతో కొందరు వ్యక్తులు బుధ వారం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బీసీ జనాభా పెరగడంతో కనీసం ఒక వార్డు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ అధికారుల నిర్ణయం అన్యాయమని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని వారు కోరినట్లు సమాచారం.