calender_icon.png 6 January, 2026 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైఫ్ స్టైల్ & ఫ్యాషన్స్ స్టాల్ ప్రారంభోత్సవం

03-01-2026 10:18:49 PM

ప్రారంభించిన మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి  ఎం కె బి ఆర్  కన్వెన్షన్ హాల్ లో శనివారం వి 4 ఈవెంట్స్, ఫెస్టివల్ సీజన్ 2,లైఫ్ స్టైల్ & ఫ్యాషన్స్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి,మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, ఫిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని స్టాల్స్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు స్థానిక వ్యాపారాలకు, మహిళలకు ప్రోత్సాహంగా నిలుస్తాయని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.

నిర్వాహకులు పోరెడ్డి కవితా రెడ్డి, చిలుముల రజిత రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల ఫ్యాషన్ స్టాల్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, హ్యాండ్‌మేడ్ ఐటమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని జనవరి 3, 4వ తేదీలు, రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, సామల సందీప్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, జావీద్ ఖాన్, యూత్ అధ్యక్షులు ప్రభు, బాలరాజు, యాసరం శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ గౌడ్, జగన్ రెడ్డి, ఉపేందర్, లగ్గాని సోమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.