calender_icon.png 6 January, 2026 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూరు గడ్డమీద కాషాయ జెండా ఎగురవేస్తాం.. బిజెపి నేతలు

03-01-2026 10:21:10 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయ  డంకా మ్రోగించి కాషాయ జెండా ఎగురవేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. శనివారం పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు ఉప్పరి రమేష్, మనోహర్ రావు, బాలేశ్వర గుప్తా, విజయ్ కుమార్, కృష్ణ ముదిరాజ్, అంతారం లలిత సాహూ శ్రీలత, సుదర్శన్ గౌడ్, భద్రేశ్వర్, బాలప్ప, మరియు బీజేవైఎం నాయకులు పాల్గొని మాట్లాడారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అమలు కానీ హామీలను ఇచ్చి మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించారు. ప్రజలు ఓటర్లు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కలసికట్టుగా గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ 36 వార్డుల్లో పోటీ చేసి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని భీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని భారతీయ జనతా పార్టీ బలంగా వార్డుల్లో రెండింతల నుండి మూడింతల వరకు అధిక ఓటర్లు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. జనవరి 10వ తేదీ వరకు ఓటర్ల జాబితా ను సరిదిద్దాలని కోరారు.