03-01-2026 10:16:17 PM
టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కేవీ రమణారావు
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం
ఖమ్మం టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ బలోపేతం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. టీజేఏ జిల్లా అధ్యక్షులు జి ఎన్ స్వామి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కె.వి. రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలని అన్నారు క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
జర్నలిస్టులందరూ ఐకమత్యంతో ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని అన్నారు. జిల్లా అధ్యక్షులు జి. ఎన్ స్వామి మాట్లాడుతూ జిల్లాలో యూనియన్ విస్తరణకు మాతో కలిసివచ్చే జర్నలిస్టులతో జిల్లా నియోజకవర్గ స్థాయి, ప్రెస్ క్లబ్ కమిటీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం టిజేఏ రాష్ట్ర అధ్యక్షులు కెవి రమణ రావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించిన కలెక్టర్ అనుదీప్ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. అనంతరం డి పి ఆర్ ఓ కార్యాలయం వెళ్లి డిపిఆర్ఓ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించడం జరిగింది.