06-01-2026 08:44:44 AM
గానుబండ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య,
గరిడేపల్లి,(విజయక్రాంతి): తన గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుతూ మండల అధికారులను శాలువాలతో సన్మానం తో విజ్ఞప్తి చేసి వినూత్న వరవడికి శ్రీకారం చుట్టారు.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ నూతన గ్రామ సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య,ఉపసర్పంచ్ నాగుల మీరా లు సోమవారం మండల కార్యాలయాలలో అధికారులను కలసి తమ గ్రామం లో నెలకొని ఉన్న సమస్యలపై వివరిస్తూ తమ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుతూ అధికారులను శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు.తహసిల్దార్ స్రవంతి,ఎంపీడీవో సరోజన,ఎస్ఐ నరేష్,అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రీతమ్ కుమార్,లు తమ గ్రామాభివృద్ధికి అధికారులు సహకరిస్తామని తెలిపారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోకల వెంకటేశ్వర్లు,కడియాల అప్పయ్య,గోధుమల ఈశ్వర చారి,కీసర చిన్న వెంకయ్య,మెండే కొల్లయ్య,ఈద వీరబాబు,జానపాటి సైదులు,ముళ్ల కోటయ్య,తదితరులు పాల్గొన్నారు.