calender_icon.png 7 January, 2026 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడి కన్నుమూత

06-01-2026 09:09:03 AM

పుణె: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడి(Former Union minister Suresh Kalmadi) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ కల్మాడి( Suresh Kalmadi) పుణెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయసు 81. 1944 మే 1న సురేశ్ కల్మాడి మద్రాస్ లో జన్మించారు. ఆయన రెండు సార్లు లోక్ సభ, మూడు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. పీవీ నరసింహారావు కేబినెట్(PV Narasimha Rao Cabinet)లో సురేష్ కల్మాడి రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఏషియన్ అథ్లెటిక్ అసోసియేషన్  అధ్యక్షుడిగా  కల్మాడి సేవలందించారు. భారత్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.  సురేష్ కల్మాడి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.