06-01-2026 08:42:49 AM
జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించిన తుర్కలపల్లి గ్రామస్తులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన గుట్ట ఆధారంగా తమ పాడి, పశువులు, మేకలు , గోర్లు మేపుకుంటూ జీవించేందుకు అనుకూలంగా ఉన్న సమీప గుట్టను తొలిచి డిండి నిర్వాసితులకు ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతుందని దాని ఫలితంగా తమ గ్రామస్తులు, ఇతర జీవరాసులు పక్షు జాతులు తీవ్రంగా నష్టపోతాయని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామ శివారులోని తుర్కలపల్లి గ్రామస్తులు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్ కి ఫిర్యాదు చేశారు. డిండి ప్రాజెక్టులో భాగంగా ముంపు నకు గురవుతున్న ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారని అట్టి సర్వేను నిలిపివేస్తూ ఆ గుట్టను తొలచవద్దని గ్రామస్తులు యువజన సంఘం నేతలు పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేశారు.