04-09-2025 12:00:00 AM
రైతులకు వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ సంఘీభావం
తాండూరు, 3 ఆగస్టు (విజయక్రాంతి) : పంటలకు సరిపడా యూరియా అందించాలని వికారాబాద్ జిల్లా యాలాల రైతు సేవ సహకార సంఘం కార్యాలయం ముందు బుధవారం రైతులు మెరుపు ధర్నాకు దిగా రు. రోడ్డుపై బైఠాయించి యూరియా లోడ్ తో వచ్చిన లారీని అడ్డుకొని లారీలో ఉన్న 400 సంచులు మండల రైతులకే ఇవ్వాలంటూ ఆందోళన నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే యూరియ కొరత ఏర్పడిందని యూరియా అందించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలకు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుగ్గప్ప, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య సంఘీభావం తెలుపుతూ రైతులతో పాటు రోడ్డుపై బైఠాయించారు.
అయి తే లారీలో ఉన్న 400 యూరియా సంచు ల్లో 200 మాత్రమే యాలాల మండల రైతులకు మిగత 200 బ్యాగులు బషీరాబాద్ మండలానికి తరలించే విషయమై రైతులకు,అధికారులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది .విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులకు సరిది చెప్పారు. ఈ సందర్భంగా బుగ్గప్ప, మల్కయ్య లు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలం అయ్యిందని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ ఆందోళనలో మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు భారీగా పాల్గొన్నారు.
రైతాంగానికి సరిపడా యూరియా అందించాలి..సహకార సంఘం ఎదుట రైతుల ఆందోళన..
యాచారం, సెప్టెంబర్ 3 : రైతులకు సరిపడా యూరియా అందించాలని మండల కేంద్రంలో బుధవారం సహకార సంఘము ముందు రైతులు ధర్నా చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎటువంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడ్డామని అయినా కూడా యూరియా అందడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు 600 మంది రైతులు ఉంటే గోడౌన్ కి 400 వందల యూరియా బస్తాలు వచ్చాయని రైతులు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.
రైతులకు సకలానికి యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో పంటలు తీవ్రంగా నష్టపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరకోర సప్లై చేయడంతో ఎకరానికి రెండు బస్తాలు వాడవలసిన యూరియాను రైతుకు ఒకటే బస్తా ఇవ్వడంతో రైతులు అధికారులపై మండిపడ్డారు. రైతులతో మండల వ్యవసాయ అధికారి రవినాథ్ మాట్లాడుతూ. రెండు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా వస్తుందని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు.