calender_icon.png 10 September, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర అన్యాయం

04-09-2025 12:00:00 AM

-జీవో నెంబర్ 99ను తక్షణమే సవరించాలి

-జాతీయ మాల మహానాడు జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం

ఘట్ కేసర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : ప్రభుత్వం తీసుకువచ్చిన రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగు తుందని, జీవో నెంబర్ 99ను తక్షణమే సవరించాలని జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం డిమాండ్ చేశారు. బుధవారం ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు మున్సిపల్ అధ్యక్షులు ఎజ్జల రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కన్వీనర్ గుజ్జుక పరుశురాం హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలలపట్ల సవతి తల్లి ప్రేమ చూపి అణిచి వేస్తున్న తీరు చాలా బాధాకరమన్నారు.

జీవో 99 తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఎస్సీ వర్గీక రణ జీవో 99లో అందరి ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉన్నందున జాతీయ మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్  పిలు పు మేరకు ఈనెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను మాల మహానాడు ఆధ్వర్యంలో ముట్టడి చేయాలని పిలుపునివ్వడం జరిగిoదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో 99 వెనక్కి తీసుకోవాలని, రోస్టర్ పాయింట్లు 22 నుంచి 1 పాయింట్ కు తగ్గించాలని అదేవిధంగా జీవోను 99ను సవరించాలని డి మాండ్ చేశారు.

దళితుల మధ్య వర్గీకరణ చేసి తీరని అన్యాయం చేస్తున్నారని, భవిష్యత్తులో ఉపసంహరించుకోకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడితోపాటు అనేక కార్యక్రమాలు రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పడిగo ఆంజనేయులు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళీమోహన్, నాయకులు పడిగం ప్రవీణ్, తాల్క రాము లు, గుమ్మడి రాము, ఈసo మధు, పర్నాటి సాయికిరణ్, గుమ్మడి అనిల్, ఎస్. బద్రి, మంతూరీ గోపి తదితరులు పాల్గొన్నారు.