21-09-2025 12:40:36 AM
మేడ్చల్‌లో కనువిందు
మేడ్చల్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సాధారణంగా ఉరుము, మెరుపు ఒకేసారి సంభవిస్తాయి. మెరుపు వచ్చిన వెంటనే ఉరుము శబ్దం వినిపిస్తుంది. ధ్వని కంటే కాంతి వేగం ఎక్కువ కాబట్టి ముందుగా మెరుపు కనిపిస్తుంది. ఒక్కోసారి ఉరుము లేకున్నా మెరుపు కనిపిస్తుం ది. శనివారం రాత్రి మేడ్చల్‌లోని కేఎల్‌ఆర్ కాలనీలో ఉరుము లేకుండా సుమారు అరగంట పాటు మెరుపులు వచ్చాయి. ఒక్కోసారి భారీగా కాంతి వెదజల్లింది. మెరుపు దృశ్యాలు కనువిం దు చేశాయి. ఆగకుండా మెరుపులు రావడం తో స్థానికులు భయాందోళనకు కూడా గురయ్యారు.