calender_icon.png 22 October, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీప కాంతులు.. పటాకుల మోతలు

22-10-2025 12:00:00 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగ వేడుక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీప కాంతులు టపాసుల మోతతో పండగ వేడుక సంబరాలుఅంబరాన్ని తాకాయి.  పండగ సందర్భంగా ఇళ్లల్లో, వ్యాపార వాణిజ్య సంస్థల్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ దేవికి పూజలు చేశారు. అనంతరం దీపావళి వేడుకల్లో టపాసులు కాలుస్తూ ఆనం దోత్సవాల మధ్య పాల్గొన్నారు.  అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా నేరడిగొండ మండలంలోని బందంరేగడి గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.

ఈ సందర్భంగా గ్రామంలోని గుస్సాడీలు, మహిళలు మంగళహారతులతో, సాంప్రదాయపు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  దండారి నృత్యాలు చేస్తూ ఆదివాసీలను ఉత్సాహపరిచారు. అటు దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా తన స్వగృహంలో ప్రత్యేక పూజ లు చేశారు. అదేవిధంగా పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలలో నిర్వహించిన లక్ష్మీ పూజ కార్యక్రమాల్లో సోమవారం ఆయ న పాల్గొన్నారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో...

దీపావళి పండుగ వేడుకలు జిల్లా వ్యాప్తం గా ప్రజలు ఘనంగా నిర్వహించారు. సోమవారం భోగి పండుగ వేడుకల్లో భాగంగా ఉదయం తోబుట్టువులతో మంగళ హారతులు తీసుకొని కర్రలతో తయారుచేసిన కోల తిప్పుకున్నారు. సాయంత్రం వ్యాపారస్తులు లక్ష్మీ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వస్తువులు కొనడానికి వివిధ మండలాల నుండి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలతో జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. మంగళవారం కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకున్నారు. 

నిర్మల్ జిల్లాలో.. 

నిర్మల్ జిల్లాలో దీపావళి పండుగను ప్రజ లు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వారి వారి ఇండ్లలో లక్ష్మీ పూజ నిర్వహించిన ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున పటాకులు కాల్చి దీపావళి వేడుకలను నిర్వహించారు ఏడాదంతా వెలుగుల జీవితం కావాలని ప్రజలు అకాంక్షించారు.