22-10-2025 12:00:00 AM
హాజరైన ఎమ్మెల్యే పాయల్
ఆదిలాబాద్, అక్టోబర్ 2౧ (విజయక్రాం తి): దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలు వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మావల మండలం పరిధిలోని కొమరం భీం కాలనీలో సోమవారం జరిగిన దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేయగా, కిషన్ రెడ్డి ఆదివాసీలకు దీపావళి, దండారీ ఉత్సవాల శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఎమ్మె ల్యే గుస్సాడీ నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనకు సమయం దొరికినప్పుడల్ల ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరిగిందని గుర్తు చేశారు.
కొము రం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృ షి చేస్తున్నానని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెం టనే పట్టాలి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.