22-10-2025 12:00:00 AM
సంస్మరణ దినోత్సవంలో వక్తలు
నివాళులర్పించిన జిల్లా జడ్జి, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు
ఆదిలాబాద్/ నిర్మల్/ కుమ్రం భీం ఆసిఫాబాద్/ మంచిర్యాల/ బెల్లంపల్లి/ హాజీపూర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్‌డే) వేడుకలను ఘనంగా నిర్వహించా రు. మంగళవారం ఏఆర్ హెడ్క్వార్టర్స్ ప్రాంగణంలోని చేపట్టిన కార్యక్రమంలో జిల్లా ప్రధా న న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
ముందుగా శాంతి భద్రతల పరిరక్షణలో, దేశ సరిహద్దుల రక్షణలో, విధి నిర్వహణలో ప్రా ణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూఅతిథులు జ్యోతి వెలిగించి, అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో అమరవీరుల ముఖ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ స్తూపం ప్రత్యేక గుర్తింపు పొందిం ది. అనంతరం అమరవీరులకు గౌరవ వంద నం సమర్పించారు. రెండు నిమిషాల మౌనం పాటించి అమరవీరుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ... తమ కుటుంబాలను పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసులు మాత్రమే చేయగలరని వారి సేవలు నిస్వార్థమైనవి, త్యాగపూరితమైనవని అన్నారు.అమరవీరుల కుటుంబాలను జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని పేర్కొన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనవాయితీ వస్తోందన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి అవసరాలైనా పోలీసులు ఎల్లప్పు డూ అండగా ఉంటారని, వారి త్యాగం దేశానికి శాశ్వత గౌరవం తీసుకొచ్చిందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, ఇంద్రవర్ధన్, డీఎంహెచ్వో నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్‌ఎం, రెండవ బెటాలియన్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో..
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డిసిపి కరుణాకర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి హాజరై అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీసు అమరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్) శ్రీనివాస్, మంచిర్యాల ఎసిపి ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, సి పి ఓ, స్పెషల్ పార్టీ, ఏ. ఆర్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమర పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ జానకి షర్మిల
జిల్లాలో అమరవీరుల పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలుగా అందగా ఉంటా మని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసుల అమర పోలీసులకు నివాళులు అర్పిం చారు. ఈనెల 21 నుంచి 31 తేదీ వరకు జిల్లా లో పోలీసుల సంస్కరణ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపా రు. సమాజంలో శాంతి భద్రతల పర్యవేక్షణ ప్రజల రక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను పలకరించి వారి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ నిర్మల్ జిల్లాలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని ప్రజల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో శాంతి మార్గంలో నిలిపేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎ స్పీలు రాకేష్ మీనా అవినాష్ కుమార్ ఉపేందర్‌రెడ్డి జిల్లా పోలీసులు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో...
జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ , కాగజ్‌నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, పోలీసు ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. ముందుగా ఏఎస్పీ గౌరవ వందనం స్వీకరించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, టౌన్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఎంటిఓ ఆర్‌ఐ అంజన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, జిల్లా సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో
పోలీసు అమరవీరుల త్యాగాల వల్లే శాం తి భద్రతలు అదుపులోకి వచ్చాయని బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ అన్నారు. మంగళ వారం బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్‌క్వా ర్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీ సు అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్, మందమర్రి సిఐలు శ్రీనివాసరావు, హనూక్, నీలాల దేవయ్య, శశిధర్ రెడ్డి, మాదారం, రామకృష్ణాపూర్, మందమర్రి ఎస్త్స్రలు సౌజన్య, రాజశేఖర్, రాజశేఖర్ లతోపాటు సివిల్, ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యం ప్రజా రక్షణలోనే పోలీసులు
పోలీసులు 24 గంటలు ప్రజారక్షణలో నిమగ్నమై ఉంటారని, విధి నిర్వాహణలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివని 13వ బెటాలియన్ కమాండెంట్ వెంకట రాములు అన్నారు. 67వ పోలీసు అమర వీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం హాజీపూ ర్ మండలం గుడిపేటలోని 13వ బెటాలియన్ లో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ్రఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాం డెంట్ నాగేశ్వర్ రావు, బాలయ్య, ఆర్ ఐలు సతీష్ కుమార్, భాస్కర్, అన్నయ్య, అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.