09-09-2025 06:15:42 PM
కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): కామారెడ్డిలో వరద బాధితులను ఆదుకునేందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మంగళవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిధి గ్రామంలో 400 మంది బాధితులకు ఆరు లక్షల విలువైన కిరాణా సరకులు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320–D గవర్నర్ లయన్ అమర్నాథ్, కామారెడ్డి ఆర్డీవో వీణ(RDO Veena) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడీజీ లయన్ వి.టి. రాజ్‌కుమార్, కామారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ప్రవీణ్ కుమార్ గుండెల్లి, వివేకానంద లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ దేవీచంద్, సదాశివనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ నర్సారెడ్డి, జిల్లా బృంద సభ్యులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.