calender_icon.png 9 September, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

09-09-2025 06:13:24 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూలైవాడలో ప్రముఖ కవి కాళోజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు పరమేశ్వర్ విద్యార్థులకు తెలంగాణ మాండలీకంలో ప్రహేలిక(క్విజ్) పోటీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తెలంగాణ భాషను బ్రతికించుకోవాలని కోరారు. బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాషకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.