09-09-2025 06:24:13 PM
అశ్వాపురం (విజయక్రాంతి): పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. అనే మహనీయ వాక్యాలతో తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు అశ్వాపురం తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళోజీ తన సాహిత్యంతో తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని తట్టిలేపారు. స్వరాష్ట్ర ఆకాంక్షను కవిత్వంతో రగిలించిన ప్రజల మనిషి ఆయన. యువతకు ఆయన జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఆర్ఐ లీలావతి, యూడిసి కనకలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ నరసింహారావు, సిబ్బంది రాజేష్, సతీష్ కన్నమ్మ, ప్రియాంక పాల్గొన్నారు.