calender_icon.png 10 September, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ మండల స్థాయి సమావేశం

09-09-2025 11:18:26 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హసన్ పర్తి మండల స్థాయి సమావేశం మండల అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. స్థానిక సంస్థల అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ (ఎంపిటిసి, జడ్పిటిసి) లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మండల ప్రబారి రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్ లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నా నేపథ్యంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. అనంతరం మండల ప్రబారి బన్న ప్రభాకర్ ని పార్టీ ఆఫీసులో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి చల్లగుండ ప్రభాకర్ రెడ్డి, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ జీల సురేష్ యాదవ్, గుర్రాల చంద్రమౌళి, మాజీ మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిలు కోయడరాజు, చెల్పూరు శంకర్, ఉపాధ్యక్షులు సుజాత, బలగాని రవీందర్ గౌడ్, తోకల రఘుపాల్ రెడ్డి, కార్యదర్శులు దాది మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.