09-09-2025 11:22:17 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకం చేసిన 146 మంది గ్రామ పరిపాలన అధికారుల(GPO)కు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో గ్రామాలను కేటాయించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిపివోలుగా నియమితులైన వారు ఉత్తర్వులు అందుకోగా, జిల్లాల వారీగా కేటాయించిన జిపిఓలకు గ్రామాలను కేటాయించారు. ఈ మేరకు రెండు రోజులుగా జిపిఓ లకు గ్రామాల ఎంపిక కోసం ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించిన తర్వాత మంగళవారం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామాలకు కేటాయిస్తూ పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం 163 మంది గ్రామ పరిపాలన అధికారులను మహబూబాబాద్ జిల్లాకు కేటాయించగా 146 మంది ఆప్షన్ ఇవ్వడంతో పోస్టింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.