calender_icon.png 10 September, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాయిగూడెం రైతు వేదికలో మెగా రక్తదాన శిబిరం

09-09-2025 11:09:53 PM

రక్తదానం నిర్వహించిన ముప్పనపల్లి సహాయనిధి సంస్థ..

ముఖ్య అథిగా పాల్గొన్న మాజీ ఎంపిపి జనగం సమ్మక్క

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో రైతు వేదికలో ముప్పనపల్లి సహాయనిధి సంస్థ ఇంచార్జి అబ్బు సతీష్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ముప్పనపల్లి సహాయ నిధీ టీమ్ అందరూ బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కన్నాయిగూడెం మండలంలోని యవకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల మాజీ ఎంపీపీ జనగాం సమ్మక్క బ్లడ్ డొనేటర్స్ తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాజీ ఎంపిపి మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది ప్రాణదానంతో సమానం ప్రమాదనికి గురి అయినా వారికీ శత్ర చికిత్స చేసుకునేవారికి లేదా సైకిల్ సెల్ తలసేమియా, గర్భిణీ స్త్రీలకు, ఇతర డయాలసిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి రక్తం చాలా అవసరం రక్తం ఇవ్వడం ద్వారా ఈ సమాజానికి మంచి గుణనియా వ్యక్తులు అవుతారని అదే విధంగా ముప్పనపల్లి సహనీయ నిధి ఇంచార్జి అబ్బు సతీష్ చేస్తున్నా సేవలు చాలా గొప్పవి రక్త శిభీరాలె కాకుండా నిరుపేద వారికి నీడగా నిలిచి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికీ మరియు నిరూపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కానీ అంతర్జాతీయ క్రీడాకారుల ప్రోత్సహనీకి కానీ తమ సహాయనిధి గ్రూప్ నుండి సహాయం చేస్తున్నటువంటి సేవలు మరువలేమాని ఇలాంటి సేవలు మరెన్నో చేసి పేదలకు అండగా నిలవాలని కోరి అబ్బు సతీష్ కి మరియు తమ టీంకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు జాడి రాంబాబు తెలియజేసారు