09-09-2025 11:26:10 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): మెట్ పల్లి పట్టణ శివారులోని వెంపేట్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని టాటాఏస్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందినట్లు మంగళవారం స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలు... మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్య(68) అనే వ్యక్తి తన స్వంత పనుల నిమిత్తం మెట్ పల్లికి వచ్చి తిరిగి తన గ్రామం వెంపేట్ బయలుదేరాడు. మెట్ పల్లి శివారులో ఎదురుగా వస్తున్నా టాటా ఎస్ నర్సయ్య ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దింతో తీవ్ర గాయాలు అయిన నర్సయ్యను ఆసుపత్రి కి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది.