calender_icon.png 10 September, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజి మార్గమే రాజ మార్గం: సీఐ వెంకట్ రెడ్డి

09-09-2025 11:12:14 PM

సిర్గాపూర్/కంగ్టి (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, రూరల్ సీఐ వెంకట్ రెడ్డి మంగళవారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ... ఈ నెల 13వ ఫస్ట్ క్లాస్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నారాయణ్ ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ తో మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్) రాజీ చేసుకునేందుకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఉన్నది. రాజీ చేసుకునే ఇరు వర్గాలు ఈ నాలుగు రోజులలో మీ పోలీసు స్టేషన్‌కి గానీ, కోర్టుకు గానీ హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి, ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయించబడును. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, భూతగాదాలుకు సంబంధించిన కేసులు, భార్య భర్తల కేసులు, చిన్నచిన్న దొంగతనం కేసులు, అక్రమ రవాణా (ఇసుక, మట్టి, కట్టెలు, మద్యం మరియు ఇతరములు), పేకాట కేసులు వంటివి రాజి కుదుర్చుకునే సువర్ణ అవకాశం "రాజి మార్గమే రాజా మార్గమని" ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు. దీనికోసం ఫిర్యాదు దారుడు, నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని మీ సమీపంలో ఉన్నా పోలీస్ స్టేషన్‌, కోర్టుకు గానీ  రావాల్సిందిగా సీఐ వెంకట్ రెడ్డి అన్నారు.