calender_icon.png 10 September, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే యూరియా కష్టాలు

09-09-2025 11:20:44 PM

బీజేపీ నాయకుల మండిపాటు

రాస్తా రోకో,  సీఎం దిష్టి బొమ్మ దహనం

చిగురుమామిడి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే రైతులకు యూరియా కష్టాలు అని బీజేపీ నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పోలోజు సంతోష్(BJP Mandal Party President Poloju Santosh) ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా కేంద్ర ప్రభుత్వం యూరియా అందించడం లేదని చేసిన ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్రానికి సరిపడ యూరియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపిందని దానిని రైతులకు పంపిణీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

గతేడాది  ఏప్రిల్ 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు 15.33 మెట్రిక్ టన్నులు కేంద్రం నుండి పంపగా ఈ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు 17.10 మెట్రిక్ టన్నుల యూరియా మన చిగురుమామిడి మండలానికి కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వం పంపిందని, గతేడాది వర్షాకాలం సిసన్ కంటే 2.23 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చినా దానిని పంపిణీ చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రే అధికారుల సమన్వయ లోపంతోనే యూరియా కొరత ఏర్పడిందని చెప్పారని గుర్తుచేశారు. ఒకవైపు హుస్నాబాద్ శాసన సభ్యులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ రైతులు అవసరానికంటే ఎక్కువు యూరియా తీసుకొని నిల్వ పెట్టుకున్నారని మాట్లాడటం రైతులను అవమానించడమేనని వెంటనే పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్యాల  మురళీ మనోహర్, ముంజ చంద్రయ్య, మాజీ మండలా ధ్యక్షుడు అచ్చ రవీందర్, మధుసూదన్ రెడ్డి, జంగా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.