calender_icon.png 21 September, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు దొంగలు అరెస్టు: అడిషనల్ ఎస్సీ చైతన్య రెడ్డి

20-09-2025 11:03:14 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళ మెడలోని బంగారు గొలుసు దొంగిలించిన ఇద్దరు చైన్ స్నాచర్లను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి గాంధీనగర్ కాలనీలో గత రెండు రోజుల క్రితం ఓ మహిళ  మేడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన భాస్కర్ రెడ్డి, బాబా గౌడ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తెలిపారు. వారి వద్ద నుంచి ఒక బైకు మూర్తుల బంగారం మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.