3 July, 2026 | 12:44 AM

సీఎం సహాయనిధి కింద ఎల్వోసీ అందజేత

31-05-2025 12:00 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, మే 30 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలో 18 లక్షల నిధులను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు.

శుక్రవారం కామారెడ్డి పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయము లో  కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  18 లక్షల రూపాయలు లబ్దిదారులకు  పంపిణి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ  మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలోనీ  పలు గ్రామాలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.

అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎంతో కొంత  ఉపశమనం కలిగిస్తాయి అన్నారు. పేదలకు సహాయంగా అండగా. నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు  అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్న మన్నారు.

రుణమాఫీ చేసి చూపించాం అని పేర్కొన్నారు. రైతు భరోసా అందిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు  500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకము కింద నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి పొంద వచ్చు అన్నారు.

భూభారతి ద్వారా రైతుల సమస్యలు శాశ్వతంగా తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, గుడుగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, మండల పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి,మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోయల్ కర్ కన్నయ్య, తేజప్ ప్రసాద్, సయ్యద్ అన్వర్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.