calender_icon.png 15 August, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన ఎరువులు మహారాష్ట్రకు?

15-08-2025 01:21:45 AM

  1. మంచిర్యాల, చెన్నూర్ కేంద్రంగా దందా

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

మంచిర్యాల, ఆగస్టు 14 (విజయక్రాంతి): అసలే ఎరువుల కొరతతో రైతు లు ఇబ్బందులు పడుతుం టే మంచిర్యాల జిల్లాలో హోల్‌సేల్ వ్యాపారులు అందినకాడికి దం డుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వ్యవసాయాధికారి భుక్య చత్రు నాయక్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ, అర్హులకు ఎరువులు అందజేయాలని ఆదేశిస్తున్నా హోల్‌సేల్ వ్యాపారులు అవేమీ పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంతోపాటు చెన్నూర్ కేంద్రంగా భారీ ఎరువుల దందా కొనసాగుతోంది. జిల్లా స్థాయి అధికారులు ఎంత కట్టడి చేయాలని చూసినా డివిజన్, మండల స్థాయి అధికారుల అండతో ఎరువులు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు పెద్ద తరలుతోంది. మహారాష్ట్రకు మంచిర్యాల నుంచి చెన్నూర్, కోటపల్లి మండలాల మీదుగా ఎరువులు రవాణా అయ్యేవి. కానీ కొందరు వ్యాపారులు దొంగచాటుగా సుందరశాల, అన్నారం మీదుగా తరలిస్తున్నారు.

అన్నారంలోని ఒక ప్రైవేటు డీలర్ పేరిట లేదా సుందరశాలలోని ఫర్టిలైజర్ దుకాణం పేరిట బిల్‌తో వచ్చి, సుందరశాల నుంచి చిన్న వాహనాల ద్వారా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే అన్నారం బ్యారేజ్ మీద నుంచి పెద్ద వాహనాలకు అనుమతి లేకపోవడంతో దందా రూట్‌ను మార్చి ఇలా చేస్తున్నారు. అయినా సంబంధిత శాఖ అదికారులకు కనిపించకపోవడం శోఛనీయం.

రైతుల తంటాలు

జిల్లాలో ఎరువుల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం రైతులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా హోల్ సేల్ డీలర్ల మాయాజా లానికి ఏం చేయలేకపోతున్నారు.

జిల్లాలోని అన్ని హోల్ సేల్ డీలర్ల నుంచి ఎరువులు ఎక్కడికి వెళుతున్నాయి, అవి ఎవరికి చేరుతున్నాయో పరిశీలిస్తే ఈ దందా మొత్తం వెలుగులోకి రానుంది. మరోవైపు వ్యాపారులు రైతుల ఆధార్‌కార్డులతో డమ్మీ సేల్స్ చూపుతున్నారు. ఇదంతా మండల స్థాయిలో అధికారులకు తెలిసే జరుగుతున్నట్లు సమాచారం.