22-12-2025 02:16:01 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 21(విజయక్రాంతి): కేసులు సత్వరా పరిష్కారానికి లోక్ ఆదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని, రాజీ మార్గం రాజ మార్గమని హయత్ నగర్ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సల్మా ఫాతిమా, అదనపు న్యాయమూర్తి ఫార్హన్ బేగం పేర్కొన్నారు. ఆదివారం జరిగిన లోక్ ఆదాలత్ లో మొత్తం 4699 కేసులు పరిష్కరించినట్లు న్యాయమూర్తులు తెలిపారు. పరిష్కరించిన కేసుల్లో ముఖ్యమైనది 2013లో నమోదైన సివిల్ కేసు. మేకల శివలక్ష్మినారాయణ V/s గుజ్జుల జనార్దన్ అండ్ ఇతరులు సూట్ ఫర్ ఇంజక్షన్ కేసు 12 సంవత్సరాల సుధీర్ఘ విచారణ చేపట్టారు.
ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి సల్మాఫాతిమా చొరవతో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ కేసులో ఇరువురు కక్షిదారులు వయోవృద్దులు కావటం విశేషం, ఈ కేసులో ఇరువురు కక్షిదారులు కేసు పరిష్కారం కావడంతో ప్రధాన న్యాయమూర్తి సల్మా ఫాతిమా, అదనపు న్యాయమూర్తి ఫార్హన్ బేగం, కోర్టు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి గొట్టె రవీందర్, ప్రధాన న్యాయమూర్తి సల్మా ఫాతిమా, అదనపు న్యాయ మూర్తి ఫార్హన్ బేగం, వనస్థలిపురం ఏసీపీ కాశి రెడ్డి వనస్థలిపురం సీఐ మహేష్ గౌడ్, హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ అశోక్ రెడ్డి, ఏపీపీ లావణ్య కుమార్, లోక్ ఆదాలత్ బెంచ్ మెంబర్స్ జానమ్మ, భార్గవి, శృతి, బాల నాగేశ్వర్ రావు, లీగల్ ఎయిడ్ న్యాయవాదులు సత్యనారాయణ, శివ, హయత్ నగర్ న్యాయవాద సంఘం అధ్యక్షుడు మోడెం ప్రభాకర్, ఉపాధ్యక్షుడు మేకల సతీష్,ప్రధాన కార్యదర్శి అనుముల రామ్మోహన్, బండి నరేష్, సంయుక్త కార్యదర్శి బాడీగా అంజయ్య గౌడ్, మహిళా ప్రతినిధి చెరుకు సుమలత, కోశాధికారి తోరుపునూరి ఈశ్వర్ గౌడ్, గ్రంధాలయ కార్యదర్శి డాక్టర్ ఈసారపు సైదులు గౌడ్, క్రీడలు అండ్ సాంసృతిక కార్యదర్శి సోమపంగు రాజేశ్, కార్యనిర్వాహక సభ్యులు వి.శృతి, బి. మేఘన, కె. గోపి శంకర్, వి. సాయి కృష్ణ, జయసుధ దేవి, పద్మ, సాంబ శివుడు పాల్గొన్నారు.