calender_icon.png 15 August, 2025 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చూడు బార్బరికా.. ఈ యుద్ధం నీది

14-08-2025 12:00:00 AM

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేశ్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 22న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు.

మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు తిరిగే కథ అని అర్థమవుతోంది. ఓ పురాణ కథకు, వర్తమాన సామాజిక సమస్యల్ని ముడిపెడుతూ కథను దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించినట్టనిపిస్తోంది. లవ్‌స్టోరీ, తాత మనవరాలి ట్రాక్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్‌లో ‘చూడు బార్బరికా.. ఈ యుద్ధం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడా లంటే అధర్మం చేసేవారికి దండన లభించాలి’.. ‘పాలల్లో నీళ్లే కలుపుత.. విషం కలుప’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి.