calender_icon.png 15 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది!

14-08-2025 12:00:00 AM

వీధి కుక్కల విషయమై సుప్రీంకోర్టు పలు ఆదేశాలు చేసిన నేపథ్యం లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ తీర్పును సమర్థిస్తుండగా, జంతు ప్రేమికులు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటి సదా సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. వెక్కివెక్కి ఏడుస్తున్న సదా మాటలు ఆలోచింపజేస్తున్నాయి.

‘సుప్రీంకోర్టు తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కి తీసుకోండి. నగరంలో మూడు లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. వాటన్నింటికి షెల్టర్లు చూపించే కెపాసిటీ స్థానిక సంస్థలకు లేదు. చివరకు వాటిని చంపేసే పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో ఏడెనిమిది వారాల్లో వీధికుక్కల మాస్ కిల్లింగ్స్ చూడబోతున్నాం.

స్ట్రీట్ డాగ్స్‌కు రాబిస్ రాకుండా వ్యాక్సిన్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. వాటికోసం బడ్జెట్ కేటాయించి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, స్థానిక సంస్థలు దీన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ఏర్పాటు చేయడానికి కొన్ని ఎన్జీవోలు తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నాయి. నేను ఎన్నో ఏళ్ల నుంచి మూగజీవాలకు సాయం చేస్తున్నా. కానీ ప్రభుత్వం నుంచి అలాంటివారికి ఎలాంటి సహాయం అందడం లేదు” అని పేర్కొంది సదా.