17-02-2026 12:57:47 AM
ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
బస్సు లో నుండి రోడ్డుపై పడిన విద్యార్థి తలకు తీవ్ర గాయాలు
భీమదేవరపల్లి ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో సోమవారం ఉదయం స్కూలు బస్సు ను లారీ ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ నుండి ముల్కనూర్ కు వస్తున్న స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద కు బస్సు రాగానే వెనుక నుండి వస్తున్న లారీ బస్సును ఢీకొడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ సంఘటనలో బస్సు లో నుండి ఒక విద్యార్థి రోడ్డుపై పడంతో తలకు గాయాలయ్యాయి మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు కూలర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు విద్యార్థులను బస్సు నుండి సురక్షితంగా బయటకు దించారు. బస్సు లో నుండి కిందపడిన విద్యార్థికి తలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రమాదంపై ముల్కనూర్ ఎస్త్స్ర రాజు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.