calender_icon.png 17 February, 2026 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించండి

17-02-2026 12:59:00 AM

యూనిట్ అధికారులను ఆదేశించిన పిఓ రాహుల్ 

భద్రాచలం, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి) : సుదూర మారుమూల గిరిజన గ్రామాల నుండి వివిధ సమస్యల గురించి గిరిజన దర్బార్ లో విన్నవించు కోవడానికి వచ్చే గిరిజనులకు సంబంధిత యూనిట్ అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్  అన్నారు.

సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరం లో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులు త్వరితగతిన గిరిజనుల సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకర్ రుణాలు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుట కొరకు, తమ గ్రామాలలో అంగన్వాడి పాఠశాల ఏర్పాటు కొరకు మరియు కిరాణా షాపులు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం ఇప్పించుటకు,

పంట పొలాలలో సోలార్ ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పొందడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, నూతనంగా ఇసుక సొసైటీలు ఏర్పాటు కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక అభివృద్ధి కల్పించుట కొరకు,మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.

దమ్మపేట మండలం పూసుకుంట గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇందిరమ్మ బిల్లులు ఇప్పించుట కొరకు, జూలూరుపాడు మండలం బొజ్జా తండాకి చెందిన వీరన్న మరియు గ్రామస్తులు కరెంటు, బోరు, మోటార్లు ఇప్పించు ట కోరకు, టేకులపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రమేష్ పోడు పట్టాలు ఇప్పించుట కొరకు, బూర్గంపాడు మండలం చింత కుంట గ్రామానికి చెందిన స్వరూప మరియు గ్రామస్తులు అంగన్వాడి సెంటర్ భవనం,

రోడ్డు సౌకర్యం కల్పించుట కొరకు, సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన రవితేజ జీవనోపాధి కొరకు ఆర్వో ప్లాంట్ కనెక్షన్ ఇప్పించుట కొరకు, చర్ల మండలం సత్యనారాయణపురంకి చెందిన ముత్యాలు రైతు భరోసా ఇప్పించుట కొరకు, పాల్వంచ మండలంకి చెందిన ఈశ్వరమ్మ ఇందిరమ్మ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ నిర్మించుట కొరకు,

లక్ష్మీదేవి పల్లి మండలంకి చెందిన సత్యనారాయణ తమ పొలములో సోలార్ కనెక్షన్ ఇప్పించుట కొరకు అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. గిరిజన దర్బార్ లో గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, విడతల వారీగా వారి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, ఏ పీ ఓ పవర్ వేణు, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎన్ టిసి ఉదయ్ కుమార్, ఎల్ టి ఆర్ డిటి నాగేశ్వరరావు, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హెచ్డి శంకరాచార్యులు, హౌసింగ్ ఏఈ హేమంత్, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ,జేడీఎం హరికృష్ణ, ఇతర విభాగాల సిబ్బంది వెంకటేశ్వర్లు, జయరాజ్, మోహన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.