17-02-2026 12:57:34 AM
కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 16, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఎన్నికైనందున జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీతో వారిని మర్యాదపూర్వక కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్. వారి వెంట దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం మధు, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కామారెడ్డి జిల్లా బీసీ సంఘం నాయకులు నీల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.