16-09-2025 07:31:43 PM
బోథ్ (విజయక్రాంతి): అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని మంగళవారం పట్టుకున్నామని బోథ్ ఎస్సై శ్రీసాయి(SI Sri Sai) పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రజ్వి, జవీద్ అనే ఇరువురు నిందితులు నాగపూర్ నుండి అక్రమంగా 33 ఎడ్లతో కూడిన లారీతో హైదరాబాద్ లోని శంషాబాద్ కు తరలిస్తుండగా సొనాల మండలంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అయినా ఘన్పూర్ చెక్ పోస్ట్ వద్ద బోథ్ పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుకున్న 33 ఎడ్లను ఇచ్చోడలోని జైశ్రీరామ్ గోశాలకు తరలించిన్నట్లు తెలిపారు.